1971 వార్ హీరోలకు నివాళులర్పించిన ప్రధాని మోడీ

1971 వార్ హీరోలకు నివాళులర్పించిన ప్రధాని మోడీ

విజయ్ దివస్ సందర్భంగా1971 వార్ హీరోలకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. 1971 డిసెంబర్‌లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి నేటితో యాభై ఏళ్లు నిండాయి. పాక్‌పై భారత్ విజయం సాధించడంతో పాటు బంగ్లాదేశ్‌కు విముక్తి లభించింది. దాంతో ప్రతి ఏటా డిసెంబర్ 16ను విజయ్ దివస్‌గా నిర్వహిస్తున్నారు. నేషనల్ వార్ మెమోరియల్‌లో 50వ వార్షికోత్సవ వేడుకలను నరేంద్రమోడీ ప్రారంభించారు. గోల్డెన్ విక్టరీ టార్చ్‌లను వెలిగించి.. 1971 వార్ హీరోలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గోల్డెన్ వార్ వర్ష్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటు రాజ్ నాథ్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.

1971 డిసెంబర్‌లో జరిగిన ఈ యుద్ధంలో… పాకిస్థాన్ ఆర్మీపై భారత భద్రతా బలగాలు చరిత్రాత్మక విజయం సాధించాయని రక్షణ శాఖ తెలిపింది. ఈ యుద్ధంతోనే స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పడింది. ఈ యుద్ధంలో ఓటమి తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ నాజీ 93 వేల మంది సైన్యంతో భారత్‌కు సరెండర్ అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ వార్‌లోనే భారీసంఖ్యలో పాక్ మిలటరీ భారత్‌కు లొంగిపోయింది. పాకిస్థాన్‌పై విజయానికి యాభై ఏళ్లు గడుస్తున్న సందర్భంగా.. ఈ ఏడాది పొడవునా దేశమంతటా పలు విజయోత్సవాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. మెమోరియల్ వార్ దగ్గర ప్రధాని మొత్తం నాలుగు విక్టరీ టార్చ్‌లను వెలిగించారు. 1971 యుద్ధంలో పాల్గొని పరమ వీర చక్ర, మహావీర చక్ర అవార్డీలు పొందిన సైనికుల గ్రామాలకు ఈ జ్యోతులను తీసుకెళ్తారు. ఆ వీర సైనికులు పుట్టిన నేలనుంచి మట్టిని ఢిల్లీలోని నేషనల్ వార్ మమోరియల్‌కు తీసుకొస్తారు.

For More News..

వీడియో: క్యాచ్ మిస్ చేశాడని స్టేడియంలోనే కొట్టినంత పనిచేసిన కెప్టెన్

58 నిమిషాల్లో 46 వంటకాలు చేసిన చిన్నారి

ఈ బుడతడు నా యాంకరింగ్‌ సీటును కొట్టేసేలా ఉన్నాడు