25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయటమే లక్ష్యం: మోదీ

25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయటమే లక్ష్యం: మోదీ

25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయడమే  తమ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. ఇవాళ పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన మోదీ.. ఎమర్జెన్సీతో దేశం నష్టపోయిందన్నారు.  50 ఏళ్ల క్రితం జరిగిన తప్పును ఎవరూ చేయొద్దన్నారు. అప్పట్లో ప్రజలను జైల్లో వేశారని..  ప్రజాస్వామ్యంపై పడిన మచ్చకు జూన్ 25తో  50 ఏళ్లు పూర్తి అని అని చెప్పారు.  మూడోసారి అధికారం రావడం గొప్ప విషయం కాదని.. మూడో దఫాలో మూడు రెట్లు రెట్టింపుతో పనిచేస్తామన్నారు మోదీ. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయడమే తమ లక్ష్యమన్నారు. సామాన్య ప్రజలు కలలు  సాకారం చేస్తామని చెప్పారు.

ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ నిర్వహించామని మోదీ అన్నారు. 65 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారని..తమ మీద నమ్మకంతోనే ప్రజలు  మూడోసారి అధికారం ఇచ్చారని చెప్పారు. తమ విధానాలు, అంకిత భావానికి దేశ ప్రజలు ఆమోదం తెలిపారన్నారు. మూడోసారి ప్రధానిగా సేవచేసే అవకాశం దక్కిందన్నారు. 10 ఏళ్లలో దేశాభివృద్ధికి కృషి చేశామన్నారు. ఈ సారి రెట్టింపుతో పని చేసి  140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు  నెరవెరుస్తామని చెప్పారు మోదీ. 

18వ లోక్ సభలో యువ ఎంపీల సంఖ్య పెరిగిందన్నారు ప్రధాని మోదీ. 18వ నంబర్ కు  ఎంతో గుర్తింపు  ఉంది.. మన దేశంలో 18 ఏళ్లకే ఓటు వేసే హక్కు ఉంటుందన్నారు. . భగవద్గీతలో అధ్యాయాలు 18,  పురాణాలు 18 అని అన్నారు.  ఈ రోజు చాలా పవిత్రమైన రోజని  ప్రధాని మోదీ అన్నారు. ఎంపీలందరికి స్వాగతం చెప్పారు.  ఎంపీలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సూచించారు.  శ్రేష్ట భారత్ నిర్మాణమే తమ లక్ష్యమని తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం కృషిచేస్తున్నామని తెలిపారు.  కొత్త లక్ష్యాలు చేరుకోవడానికి మనమంతా కృషిచేయాలని పిలుపునిచ్చారు.  కొత్త లక్ష్యాలు, కొత్త ఆశయాలతో ముందుకెళ్లాలని సూచించారు.