
ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని భారత్ కు తరలించేందుకు విమానాల సంఖ్యను పెంచాలని ప్రధాని మోడీ అధికారులను ఆదేశించారు. ఉక్రెయిన్ పరిస్థితులపై మోడీ ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుపై ఆయన అధికారులతో చర్చించారు. ఇప్పటికే ఆపరేషన్ గంగ పేరుతో భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలిస్తున్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారతీయులను తరలిస్తున్నారు. తాజాగా కీవ్ లో గాయపడిన భారతీయ విద్యార్థి ఘటనపై కూడా చర్చించినట్లు సమాచారం. అత్యంత వేగంగా భారతీయులను తరలించాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 9 వేల మందిని తరలించారు. మరో ఐదు వేల మంది వరకూ భారతీయులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో వారందరీని త్వరగా భారత్ కు తరలించాలన్నారు.
మరిన్ని వార్తల కోసం..
న్యూక్లియర్ ప్లాంట్‌లో మంటలు ఆర్పేసినం