ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై  ప్రధాని మోడీ సమీక్ష

ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై  ప్రధాని మోడీ సమీక్ష

ప్రధాని మోడీ ఇవాళ(గురువారం) సాయంత్రం కేంద్ర కేబినెట్ మంత్రులతో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగిన నేపథ్యంలో ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా  భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ప్రభావితం అవుతుంది? దానిని ఎదుర్కోవడం ఎలా? అన్న అంశాలపై ఈ సమావేశం చర్చిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

బంగారం ధరల పెరుగుదల, చమురు ధలర పెరుగుదల, స్టాక్ మార్కెట్ల పతనం.. ఈ అంశాలన్నీ చర్చకు రానున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలిఖా కోరారు. ఈ యుద్ధాన్ని ఆపడంలో భారత్ తన వంతు పాత్రపోషించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు  అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

దాడులు ఉక్రెయిన్ ప్రజలకు వ్యతిరేకం కాదు