17న దావోస్ సమ్మిట్​లో మోడీ స్పీచ్

17న దావోస్ సమ్మిట్​లో మోడీ స్పీచ్
  •  వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు

న్యూఢిల్లీ: స్విట్జర్​ల్యాండ్ లోని దావోస్​లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. సమ్మిట్ మొదటి రోజు ఈ నెల 17న మోడీ ప్రసంగిస్తారని పీఎంవో శుక్రవారం తెలిపింది. వారం రోజుల పాటు వర్చువల్ మోడ్​లో జరిగే ఈ సమ్మిట్​లో మోడీతో పాటు ఆస్ట్రేలియా, జపాన్, ఇజ్రాయెల్ ప్రధానులు, తదితర దేశాల అధ్యక్షులు, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ పాల్గొంటారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, పరిష్కారాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. వ్యాక్సిన్ తయారీ, కరోనా కట్టడిపైనా డిస్కస్ చేయనున్నారు.
ఇయ్యాల స్టార్టప్​లతో పీఎం భేటీ
మన దేశంలోని పలు రంగాలకు చెందిన 150కి పైగా స్టార్టప్​ ప్రతినిధులతో మోడీ శనివారం వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడనున్నారు. వ్యవసాయం, ఆరోగ్యంతో పాటు పర్యావరణం, ఎంటర్​ప్రైజెస్ సిస్టమ్, స్పేస్, ఇండస్ట్రీ 4.0, సెక్యూరిటీ, ఫిన్​టెక్ వంటి వివిధ రంగాలకు చెందిన స్టార్టప్​లు కాన్ఫరెన్స్​లో పాల్గొంటాయని పీఎం ఆఫీస్ శుక్రవారం తెలిపింది. స్టార్టప్​ల కొత్త ఆవిష్కరణలు దేశ అవసరాలకు ఎలా ఉపయోగపడతాయో అర్థం చేసుకునేందుకే ఈ భేటీ అని పేర్కొంది.