
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జీవింతాంతం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
మరోవైపు.. రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కూడా సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సీఎం కేసీఆర్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.