కొలంబో : శ్రీలంకలో ఆర్థిక రికవరీతో పాటు రాజకీయ స్థిరతకు ఇండియా తనవంతు సహాయ సహకారాలు అంది స్తుందని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేకు అభినందనలు తెలిపారు. ఇండియా మద్దతు శ్రీలంకకు ఎప్పటికీ ఉంటుందని స్పష్టంచేశారు. 73 ఏండ్ల విక్రమ సింఘే శ్రీలంక 8వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అభినందనలతో కూడిన లేఖను ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంకకు పంపినట్టు ఇండియన్ హై కమిషన్ తెలిపింది. ఇరు దేశాల ప్రజల మేలు కోసం కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోడీ వివరించారు. ఇండియా, శ్రీలంక మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఉందని చెప్పారు. శ్రీలంక కొత్త ప్రధాని గుణవర్ధనేకు కూడా ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.
