కరోనా విజృంభన.. సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

కరోనా విజృంభన.. సీఎంలతో  మోడీ వీడియో కాన్ఫరెన్స్

దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ..రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులపై చర్చించనున్నారు. అలాగే లాక్ డౌన్ తో ప్రజలు పడే ఇబ్బందులపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్, అలాగే తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లు పాల్గొన్నారు. మరో వైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 2094 కు చేరాయి. మృతుల సంఖ్య 57 కు చేరింది