ఈ సభ శాశ్వతం, ఎన్నటికీ రద్దు కాదు: ప్రధాని

ఈ సభ శాశ్వతం, ఎన్నటికీ రద్దు కాదు: ప్రధాని

ఎన్నో చారిత్రక సందర్భాలకు రాజ్యసభ సాక్ష్యంగా నిలిచిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా సోమవారం ప్రధాని సభలో ప్రసంగించారు. ఈ సభ చరిత్ర సృష్టించిందని, ఎంతో దూరదృష్టి కలిగిన సభ ఇదని ఆయన అన్నారు. ఈ సభ శాశ్వత సభ,  ఇక్కడికి సభ్యులు వస్తుంటారు, వెళ్తుంటారు.కానీ ఇది రద్దు కాదని ఆయన అన్నారు . ట్రిపుల్ తలాక్, జీఎస్‌టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌‌ తదితర బిల్లులు ఈ సభలోనే ఆమోదం పొందాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశానికి మేలు చేయాల్సి వచ్చినప్పుడల్లా రాజ్యసభ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉందన్నారు మోడీ.