భారత్ కు రండి.. పోప్‌కు ప్రధాని మోడీ ఆహ్వానం

భారత్ కు రండి.. పోప్‌కు ప్రధాని మోడీ ఆహ్వానం
  • వాటికన్‌లో పోప్‌తో భేటీ అయిన మోడీ 

వాటికన్ సిటీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వాటికన్‌లో క్రైస్తవ మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌తో భేటీ అయ్యారు. పోప్‌ను మోడీ కలవడం 2013 తర్వాత ఇదే మోదటిసారి. జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ రోమ్‌లో పర్యటిస్తున్నారు. పోప్ తో భేటీకి తొలుత 20 నిమిషాల భేటీ జరుగుతుందని ప్రకటించినా.. సహృద్భావ వాతావరణంలో చర్చ సుమారు గంట పాటు జరిగింది. 
పోప్ తో భేటీ గురించి ప్రధాని మోదీ ఇలా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. “పోప్ ఫ్రాన్సిస్‌తో చాలా వెచ్చని సమావేశం జరిగింది. ఆయనతో విస్తృతంగా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి భారతదేశాన్ని సందర్శించమని కూడా ఆహ్వానించాను..’’ అని వెల్లడించారు. అటల్ బిహారి వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 1999లో పోప్ భారత్ ను సందర్శించిన విషయం తెలిసిందే.