ఆస్ట్రేలియాలో అందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్

ఆస్ట్రేలియాలో అందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్

మెల్ బోర్న్: దేశ ప్రజలందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మోరిసన్ ప్రకటించారు. ఇందుకోసం ఆస్ట్రాజెనికా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఆస్ట్రాజెనికా కంపెనీ ఆక్స్ ఫర్డ్యూనివర్సిటీ తో కలిసి వ్యాక్సిన్ డెవలప్ చేస్తోంది. ‘‘ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తయారీ అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్లలో ఆక్స్ ఫర్ట్టీకా రిజల్స్ట్ ఆశాజనకంగా ఉన్నాయి. ఒకవేళ ఈ వ్యాక్సిన్ సక్సెస్ అయితే, మా దేశంలోనే తయారు చేసి ప్రజలందరికీ ఫ్రీగా అందజేస్తాం” అని మోరిసన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన బుధవారం సిడ్నీలోని ఆస్ట్రాజెనికా లేబోరేటరీని సందర్శిం చారు. ‘‘ఇదే వ్యాక్సిన్ లేదా మరేదైనా సక్సెస్ అవుతుందా? అనే గ్యారంటీ లేదు. అందుకే వ్యాక్సిన్ కోసం వరల్డ్వైడ్ గా చాలా పార్టీలతో చర్చలు జరుపుతున్నాం” అని మోరిసన్ చెప్పారు. ఈ డీల్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఫైనల్ అగ్రిమెంట్ అయినంకనే వ్యా క్సిన్ ధర, డిస్ట్రిబ్యూషన్ పై క్లారిటీ వస్తుంది. థర్డ్ ఫేజ్లో వ్యాక్సిన్ ట్రయల్స్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రయల్స్ థర్డ్ ఫేజ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ లోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామంది. వ్యాక్సిన్‌‌‌‌ 300 కోట్ల డోసులకు కోసం వివిధ దేశాలతో ఆస్ట్రాజెనికా ఇప్పటికే డీల్‌‌‌‌ చేసుకుంది.

హైదరాబాద్ లో 6 లక్షల మందికి కరోనా.!