ప్రైమ్‌‌ వాలీబాల్‌‌ లీగ్‌‌ : ఫైనల్లో ముంబై, బెంగళూరు

ప్రైమ్‌‌ వాలీబాల్‌‌ లీగ్‌‌ : ఫైనల్లో ముంబై, బెంగళూరు

హైదరాబాద్‌‌, వెలుగు:  ప్రైమ్‌‌ వాలీబాల్‌‌ లీగ్‌‌ నాలుగో సీజన్‌‌లో ముంబై మీటియర్స్‌‌, బెంగళూరు టార్పెడోస్‌‌ ఫైనల్ చేరుకున్నాయి.  లీగ్ దశలో టేబుల్‌‌ టాపర్‌‌‌‌గా నిలిచిన ముంబై నాకౌట్‌‌లోనూ అదే జోరు కొనసాగించింది. శుక్రవారం (అక్టోబర్ 24) రాత్రి గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో మీటియర్స్  3–0 (15–-8, 15–-8, 16–-14)తో వరుస సెట్లలో  గోవా గార్డియన్స్‌‌ను చిత్తుగా ఓడించింది.  

ముంబై ఆటగాడు శుభమ్‌‌ చౌదరి ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా నిలిచాడు.  మరో మ్యాచ్‌‌లో  బెంగళూరు 3–1 (10-–15, 15-–11, 15–-13, 15-–13తో అహ్మదాబాద్‌‌ డిఫెండర్స్‌‌పై గెలిచింది.  ఆదివారం జరిగే టైటిల్‌‌ పోరులో ముంబైతో అమీతుమీ తేల్చుకోనుంది.