సెలవులు ముగిశాయి.. ఒక రోజు ఆలస్యంగా వచ్చారు.. విద్యార్థులను స్కూల్లోకిరానివ్వని ప్రిన్సిపాల్

సెలవులు ముగిశాయి.. ఒక రోజు ఆలస్యంగా వచ్చారు.. విద్యార్థులను స్కూల్లోకిరానివ్వని ప్రిన్సిపాల్

కొడంగల్, వెలుగు: దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థులు.. ఒకరోజు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్​వారిని పాఠశాలలోకి​అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల గేటు వద్దే గంటల తరబడి నిరీక్షించారు. ఈ ఘటన మంగళవారం దౌల్తాబాద్​ బీసీ గురుకుల పాఠశాల వద్ద చోటుచేసుకుంది. 

ఆధార్​కార్డు, బ్యాంక్ అకౌంట్​అప్​డెట్​చేసుకొని రావాలని సూచించడంతోనే ఆలస్యమైందని పిల్లలు తెలిపారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ శ్రీనివాస్​ను వివరణ కోరగా.. ఆర్​సీవో ఆదేశాలను పాటిస్తున్నామని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఆయనతో వాగ్వాదానికి దిగడం, విలేకరులు అక్కడికి చేరుకోవడంతో విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించారు.