జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్ వేవ్ ఉండకపోవచ్చు

జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్ వేవ్ ఉండకపోవచ్చు

పటిష్టమైన చర్యలు చేపడితే అన్ని చోట్ల కరోనా థర్డ్ వేవ్ రాబోదన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ విజయ్ రాఘవన్. రాష్ట్రాలు, జిల్లాలు, లోకల్ లెవెల్లో అమలు చేసే గైడ్ లైన్స్ పై అది ఆధారపడి ఉందన్నారు. దేశంలో థర్డ్ వేవ్ అనివార్యమని ఈ మధ్యే చెప్పారాయన. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, యూపీ, రాజస్థాన్, ఏపీ, గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, బెంగాల్, హర్యానా, బిహార్ లలో కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అయితే మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్ లలో కేసులు తగ్గుతున్నాయని చెప్పారు. అదే సమయంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ, బెంగాల్, బిహార్, హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్ లలో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.