కరోనా దెబ్బకు ఖైదీలు విడుదల

కరోనా దెబ్బకు ఖైదీలు విడుదల

కరోనా ఎఫెక్ట్తో బెయిళ్లు , పెరోళ్లు
12 రాష్ట్రాల్లో సింగిల్ అఫెన్స్ ఖైదీలకు చాన్స్
యూపీ, ఎంపీ, మహారాష్ట్రల్లో 34 వేల మంది టెంపరరీగా రిలీజ్

న్యూఢిల్లీ: కరోనావ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న సోషల్ డిస్టెన్సింగ్ లో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల జైళ్లలో ఉన్న ఖైదీల్లో కొందరిని విడుదల చేస్తున్నారు. జైళ్లలో రద్దీని తగ్గించటానికి కొంత మందిని రిలీజ్ చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు మార్చి 23న రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో పలువురు దోషులను, అండర్ ట్రయల్స్ ని తాత్కాలికంగా బెయిల్ లేదా పెరోల్ మీద విడుదల చేస్తున్నారు. ఇలా ఫ్రీడం పొందుతున్నవారి సంఖ్య మరికొద్దిరోజుల్లో వేలల్లోకి చేరనుంది. 12 రాష్ట్రాల్లో సింగిల్ అఫెన్స్ ఖైదీలకు మాత్రమే విడుదలయ్యే అవకాశామున్నట్టు జైళ్ల అధికారులు చెప్పారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహరాష్ట్రల్లో 34 వేల మంది ఖైదీలకు టెంపరరీగా రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. అయితే దేశమంతటా ట్రాన్స్ప పోర్టు బంద్ కావడంతో వీరు ఇళ్ళకు ఎలా చేరతారన్నది ప్రశ్నారక్థమైంది. దేశంలోని ఖైదీల సంఖ్య 4.5 లక్షల పైమాటే. ఇది జైళ్ల కెపాసిటీ కన్నా 17.6 శాతం ఎక్కువని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి.

మన దేశంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం…
ఢిల్లీ: దేశంలోని అతిపెద్ద జైళ్లలో ఒకటైన తీహార్ జైలు ఇక్కడే ఉంది. ఇది 10 వేల మందికి మాత్రమే సరిపోతుంది. కానీ 18 వేల మందిని ఉంచారు.
మార్చి 28న 419 మందిని రిలీజ్ చేశారు. మరో 2,600 మందినీ చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్: రాష్ట్రంలోని జైళ్లలో 60 వేల మందికే అవకాశం ఉండగా సుమారు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. మార్చి 28 నాటికి 71 జైళ్లనుంచి 11
వేల మందిని విడుదల చేసినట్టు యూపీ సర్కార్ ప్రకటించింది.
పంజాబ్: ఈ రాష్ట్రంలోమొత్తం 24 జైళ్లు ఉండగా వాటిలో 23,488 మందిని ఉంచొచ్చు. ప్రస్తుతం 24 వేల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 600
మందిని విడుదల చేయనున్నారు.
మహారాష్ట్ర: ఈ రాష్ట్రంలో జైళ్ల కెపాసిటీ 24,032 కాగా 36,195 మంది శిక్ష అనుభవిస్తున్నారు. 60 జైళ్లనుంచి 11 వేల మంది ఖైదీలను రిలీజ్ చేయనున్నారు. ట్రాన్స్ పోర్ట్ వాహనాలు లేకపోవడంతో వీళ్లంతా ఎలా ఇళ్లకు ఎలా చేరతారో అర్థం కావట్లేదని, అయినా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమ పని తాము చేస్తున్నామని ఆఫీసర్లు చెప్పారు.
మధ్యప్రదేశ్: ఖైదీల సంఖ్యతో పోల్చితే జైళ్ల కెపాసిటీ ఘోరంగా ఉన్న (బ్యాడ్ రికార్డ్కలిగిన) రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. 29 వేల మందిని ఉంచాల్సిన జైళలో్ల 45 వేల మందిని ఉంచారు. ఇందులో 12 వేల మందిని ఇంటికి పంపనున్నట్లు అధికారులు ప్రకటించారు.
కేరళ: కరోనాతో అన్ని రాష్ట్రాల కన్నా ఎఫెక్ట్ అయిన రాష్ట్రం ఇది. ఖైదీల విడుదల కోసం హైలెవల్ కమిటీ వేశారు. ఎంత మందిని విడుదల
చేస్తారనేది చెప్పలేదు.
హర్యానా: 65 ఏళ్లు పైబడిన, ఒక్క కేసులోనే దోషిగా తేలినవారిని రిలీజ్ చేయనున్నారు. పోస్కో, ఎన్డీపీఎన్డీస్ చట్టం కింద, యాసిడ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు.
తమిళనాడు: 9 సెంట్రల్ జైళ్లనుంచి 58 మందికి విముక్తి కల్పించారు.
ఉత్తరాఖండ్: జైళ్ల కెపాసిటీ కన్నా తక్కువ మంది ఖైదీలు ఉన్న రాష్ట్రం. 11 జైళ్లలో ఉన్న 855 మందికి ఆరు నెలలు బెయిల్, పెరోల్
ఇవ్వనున్నారు.
అస్సాం: మార్చి 28న 41 మందిని రిలీజ్ చేశారు.
ఒడిశా: మొత్తం 90 జైళ్లలో 1 8,012 మంది ఖైదులున్నారు. ఇందులో 1,727 మందిని రిలీజ్ చేయనున్నారు.
గుజరాత్: 1,200 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ కూడా ఇదే ఆలోచన చేస్తున్నాయి.

రాష్ట్రంలో ఇదీ పరిస్థితి..
తాత్కాలిక బెయిల్, పెరోల్స్ పై ఖైదీల ఆశలు
కరోనా ఎఫెక్తో జైళ్ల శాఖ సోషల్ డిస్టెన్స్ పాటిస్తోంది. ఖైదీల ఆరోగ్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన అధికారులు.. ములాఖాత్లను రద్దు చేసి, కెపాసిటీ కంటే
తక్కువ సంఖ్యలోనే ఖైదీలను ఉంచుతున్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కెపాసిటీకి మించి ఖైదీలుంటే అర్హులైన వారిని తాత్కాలిక బెయిల్, పెరోల్పై రిలీజ్ చేస్తున్నారు. దీంతో మిగతా వారు కూడా ఎదురుచూస్తున్నారు. కెపాసిటీ కంటే తక్కువగానే ఖైదీలు రాష్ట్రవ్యాప్తంగా మూడు సెంట్రల్ జైళతో కలిపి మొత్తం 36 జైళ్లు ఉన్నాయి. వీటిలో 7,133 మందిని ఉంచొచ్చు. ప్రస్తుతం ఖైదీల సంఖ్య సుమారు 5,400 ఉంటుంది. ఇతర రాష్ట్రాల
జైళతో పోల్చితే మన జైళ్లలో సోషల్ డిస్టెన్స్ కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు ఖైదీలు వైరస్ బారినపడకుండా జైళ్లశాఖ పటిష్ట
ఏర్పాట్లుచేసింది. సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటోంది. ప్రతి రోజు ఖైదీలకు ర్యాండమ్ గా హెల్త్ చెకప్ చేస్తున్నారు. అయితే
తాత్కాలిక బెయిల్, పెరోల్కు సంబంధించి హైలెవల్ కమిటీ నిరయ్ణం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలోని జైళ్ళలో ఉన్న
ఖైదీలకు తాత్కాలిక బెయిల్, పెరోల్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లో జైలు
నుంచి బయటకు వస్తే ఖైదీలు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

For More News..

ఏపీ ఉద్యోగులకు ఫుల్ శాలరీ

ఇయ్యాల్టి నుంచే రేషన్ పంపిణీ