ముంబైకి పృథ్వీ షా గుడ్‌‌‌‌‌‌‌‌ బై.. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ నుంచి మహారాష్ట్ర తరఫున బరిలోకి

ముంబైకి పృథ్వీ షా గుడ్‌‌‌‌‌‌‌‌ బై.. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ నుంచి మహారాష్ట్ర తరఫున బరిలోకి

ముంబై:  టీమిండియాలో చోటు కోల్పోయిన ఓపెనర్ పృథ్వీ షా ముంబై స్టేట్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌బై చెప్పాడు.  రాబోయే 2025–-26 సీజన్ నుంచి మహారాష్ట్ర తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సోమవారం ప్రకటించింది. ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్, క్రమశిక్షణ సమస్యల కారణంగా ముంబై రంజీ టీమ్‌‌‌‌‌‌‌‌ నుంచి పృథ్వీ షా ఉద్వాసనకు గురయ్యాడు. 

చివరగా  సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ఫైనల్లో మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌పై ముంబై తరఫున బరిలో దిగాడు. రంజీ టీమ్‌‌‌‌‌‌‌‌లో ప్లేస్ లేకపోవడంతో మరో రాష్ట్రానికి ఆడటానికి వీలుగా పృథ్వీ షా గత నెలలో కోరిన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీ) ముంబై క్రికెట్ అసోసియేషన్  ఆమోదించింది. ‘నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఈ సమయంలో మహారాష్ట్ర జట్టులో చేరడం వల్ల క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా మరింత ఎదగగలనని నమ్ముతున్నాను’ అని షా పేర్కొన్నాడు. 

ఇన్నేళ్లు తనకు అవకాశాలు, ఇచ్చి మద్దతుగా నిలిచినందుకు  ముంబై క్రికెట్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌కు కృతజ్ఞతలు చెప్పిన పృథ్వీ  మహారాష్ట్ర క్రికెట్ మౌలిక సదుపాయాలు తన ప్రయాణాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహిత్ పవార్ మాట్లాడుతూ పృథ్వీ షా చేరిక తమ జట్టుకు గొప్ప బలాన్ని చేకూరుస్తుందని అన్నారు. యంగ్ క్రికెటర్లకు అతని ఇంటర్నేషనల్, ఐపీఎల్ అనుభవం ఎంతో విలువైనదిగా మారుతుందని అభిప్రాయపడ్డారు.