Aadujeevitham Trailer: గొర్రెల కాపరిగా మారిన ప్రభాస్ స్నేహితుడు..ఉత్కంఠభరితంగా ఆడుజీవితం

Aadujeevitham Trailer: గొర్రెల కాపరిగా మారిన ప్రభాస్ స్నేహితుడు..ఉత్కంఠభరితంగా ఆడుజీవితం

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా నటించిన చిత్రం ది గోట్ లైఫ్(The Goat Life)(ఆడు జీవితం). బెన్యామిన్ రాసిన గోట్ డేస్ అనే నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దీన్ని తెరకెక్కించారు. 

లేటెస్ట్స్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంది.1 నిమిషం 33 సెకన్ల పాటు ఉన్నఈ ట్రైలర్ ఇంటెన్స్‌గా ఉంది. పృథ్విరాజ్ సుకుమారన్‍కు తన కెరీర్లోనే ఒకానొక బెస్ట్ క్యారెక్టర్‌గా..ఇది నిలుస్తోంది. ఆయన మేకోవర్, యాక్టింగ్ వావ్ అనేలా ఉన్నాయి.

నైంటీస్‌‌‌‌‌‌‌‌లో సౌదీ అరేబియాకు జీవనోపాధి కోసం విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే కేరళ యువకుడి రియల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌ స్టోరీ ఇది. బలవంతంగా బానిసగా గొర్రెల కాపరీగా మారిన ఓ వ్యక్తి నిజజీవిత కథ ఆధారంగా ఈ మూవీ వస్తోంది.

అంతేకాదు పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందించిన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇండియన్ సినిమా ఇది కావడం విశేషం.దాదాపు ఐదేళ్లు ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా కష్టపడ్డానని పృథ్వీరాజ్‌‌‌‌‌‌‌‌ ఎన్నోసార్లు స్టేజీ పైన చెప్పుకొచ్చాడు. 

ALSO READ :- సౌండ్ బాత్ గురించి విన్నారా?... ఒత్తిడిని చిటికెలో మాయం చేస్తుంది..

అమలాపాల్, కేఆర్ గోకుల్, హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్ లూయిస్, ప్రముఖ అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని విజువల్ రొమాన్స్ సంస్థ నిర్మించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మార్చి 28వ తేదీన మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో రిలీజ్ కానుంది.