The Goat Life OTT: గోట్‌లైఫ్‌ మూవీ OTT డీటెయిల్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి?

The Goat Life OTT: గోట్‌లైఫ్‌ మూవీ OTT డీటెయిల్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి?

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) నటించిన లేటెస్ట్ ఆడు జీవితం( ది గోట్‌లైఫ్‌). దర్శకుడు బ్లేస్సి తెరకెకెక్కించిన ఈ సినిమా మర్చి 28న థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించింది. మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా వంద కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సర్వైవల్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో.. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ నటన, ట్రాన్స్‌ఫర్మేషన్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాకి ప్రెస్టీజియస్ అవార్డ్స్ రావడం పక్కా అంటూ విమర్శలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ది గోట్ లైఫ్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ది గోట్‌లైఫ్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుందని సమాచారం. ఒప్పందం ప్రకారం థియేటర్స్ లో విడుదలైన 40 రోజుల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి.. ఆడుజీవితం మూవీ మే 10 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇక ఆడు జీవితం కథ విషయానికి వస్తే.. సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా. నజీబ్ అహ్మద్ అనే వ్యక్తి ఉపాధి కోసం, అతడి స్నేహితుడు హకీం(కేఆర్ గోపాల్‌) సౌదీ వెళతారు. అక్కడ ఎదురైన కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఇద్దరు గొర్రెల కాసే పని చేయాల్సి వస్తుంది. ఆ ఎడారిలో ఉండటానికి గూడు లేక, తినడానికి తిండి లేక దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటాడు నజీబ్. మరి అలాంటి పరిస్థితి నుండి నజీబ్ ఎలా తప్పించుకున్నాడు? అందుకోసం ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరకు ఎం జరిగింది అనేది మూవీ కథ.