మాకేం సంబంధం లేదు..పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే

మాకేం సంబంధం లేదు..పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే

స్కూళ్లకు వచ్చే పిల్లలకు ఏమైనా జరిగితే తమకేం సంబంధం లేదంటున్నాయి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు. పిల్లల బాధ్యత తల్లిదండ్రులదేనని ముందే చెప్తున్నాయి. ఇందుకోసం పేరెంట్స్  నుంచి కన్సెంట్  లెటర్లు తీసుకుంటున్నాయి. లెటర్లు ఇవ్వకపోతే స్టూడెంట్లను అనుమతించేది లేదని సర్క్యులర్లు ఇస్తున్నాయి. పిల్లలకు ఏమైనా అయితే బాధ్యత తమదేనంటూ స్కూళ్లు లెటర్లు రాయించుకోవడమేంటని మండిపడుతున్నారు పేరంట్స్. సర్కారు స్కూళ్లు, హాస్టళ్లలో పిల్లలకు కరోనా సోకితే ఇంటికి పంపాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడం పైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫిజికల్ క్లాసుల కోసం స్కూళ్లకు వచ్చే స్టూడెంట్లకు ఏమైనా జరిగితే బాధ్యత పేరెంట్స్ దేనని మేనేజ్ మెంట్లు చెబుతున్నాయి. దీనిపై పేరెంట్స్ నుంచి బలవంతంగా లెటర్లు రాయించుకుంటున్నాయి. మేనేజ్ మెంట్లు ప్రిపేర్ చేసిన ఫార్మాట్ లెటర్ పై పేరెంట్స్ సంతకం చేస్తేనే స్టూడెంట్లను అనుమతిస్తామని చెప్తున్నాయి. ఓన్ రిస్క్, రెస్పాన్సిబిలిటీతో నా పిల్లలను బడికి పంపిస్తున్న…. పిల్లల ఆరోగ్య విషయంలో స్కూల్ మేనేజ్ మెంట్ కు బాధ్యత లేదు. స్కూల్ గైడ్ లైన్స్ పాటించకపోతే నా పిల్లలను అనుమతించకండి’ అంటూ పేరెంట్స్ కన్సెంట్ ఫాం రెడీ చేశాయి స్కూళ్లు.