
శ్రీనగర్ : ప్రైవేట్ బస్సు లోయలో పడి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జమ్ముకశ్మీర్ లో జరిగింది. ఉద్ధంపూర్ జిల్లా మజాల్తా దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. సురిన్‌సార్ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
#UPDATE: Death toll rises to 6; Total 38 people were injured after a bus on its way from Surinsar towards Srinagar rolled into deep gorge in Majalta, Udhampur last night. Injured persons are being treated at a nearby hospital. https://t.co/MEgbZQ6lZL
— ANI (@ANI) March 2, 2019