కరోనాకు ఇంట్లోనే ట్రీట్​మెంట్​.. ప్రైవేట్ ఆస్పత్రుల ప్యాకేజీలివే..

కరోనాకు ఇంట్లోనే ట్రీట్​మెంట్​.. ప్రైవేట్ ఆస్పత్రుల ప్యాకేజీలివే..
  • కరోనాకు స్పెషల్​ ప్యాకేజీలు ప్రకటిస్తున్న ప్రైవేట్​ ఆస్పత్రులు
  • తీవ్రతను బట్టి 5 నుంచి 17 రోజుల వరకు ట్రీట్​మెంట్​
  • రూ.3,500 నుంచి రూ.20 వేల వరకు చార్జ్​
  • మాస్కులు, శానిటైజర్లు, థర్మామీటర్లు, ఆక్సిమీటర్లతో కరోనా కిట్​ కూడా
  • మంచి డైట్​తోనే కరోనా తొందరగా నయమవుతదంటున్న డాక్టర్లు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో రోజూ వందలకొద్దీ కరోనా కేసులు వస్తున్నాయి. అన్ని కేసులకూ ఒక్కటే కేరాఫ్​ గాంధీ. కానీ, కేసులు పెరిగే కొద్దీ అక్కడా బెడ్స్​ సరిపోయే పరిస్థితి లేదు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినా అక్కడా లిమిటెడే. అందుకే రాష్ట్ర సర్కార్​ పాజిటివ్​ వచ్చిన వాళ్లనూ హోమ్​ఐసోలేషన్​లోనే ఉంచుతోంది. ఇంటికి పంపుతోంది. అలాంటి వాళ్ల కోసం ఇప్పుడు ప్రైవేట్​ ఆస్పత్రులు ఇంటివద్దే ట్రీట్​మెంట్​ చేసే ఆఫర్లను ఇస్తున్నాయి. ప్రత్యేక ప్యాకేజీలతో సర్వీసెస్​ను ప్రకటిస్తున్నాయి. హోం ఐసోలేషన్​లో ఉన్న పేషెంట్ల కోసం స్పెషల్​ కొవిడ్​19 వర్చువల్​ హోమ్​కేర్​ ఫెసిలిటీస్​ను కొన్ని ప్రైవేట్​ఆస్పత్రులు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

బేసిక్​.. అడ్వాన్స్​డ్​​ ప్యాకేజీలు

హైదరాబాద్​లోని యశోద, కిమ్స్​, కాంటినెంటల్​, మెడికవర్​, సెంచరీ, కేర్​, కాంటినెంటల్​ వంటి ప్రముఖ ఆస్పత్రులు ఈ స్పెషల్​ హోం ట్రీట్​మెంట్​ను చేస్తున్నాయి. తీవ్రతను బట్టి బేసిక్​, అడ్వాన్స్​డ్​ ప్యాకేజీలను ఇస్తున్నాయి. కరోనా తీవ్రతను బట్టి 5 రోజుల నుంచి 17 రోజుల వరకు ట్రీట్​మెంట్​ అందిస్తున్నాయి. అందుకు రూ.3,500 నుంచి రూ.20 వేల వరకు చార్జ్​ చేస్తున్నాయి. ట్రీట్​మెంట్​తో పాటు కరోనా కిట్​ను కూడా హాస్పిటళ్లు ఇస్తున్నాయి. ట్రీట్​మెంట్​ చార్జీలకు ఇవి అదనం. ఈ కిట్​లో పల్స్​ ఆక్సిమీటర్​, డిజిటల్​థర్మామీటర్​, ఎన్​95 మాస్కులు, శానిటైజర్​, ఇన్సెంటివ్​ స్పైరోమీటర్​, వేస్ట్​ డిస్పోజబుల్​ బ్యాగ్స్​, గ్లోవ్స్​ ఉంటాయి. 24 గంటల ఎమర్జెన్సీ అంబులెన్స్​ సర్వీస్​ను అందిస్తున్నాయి. ప్యాకేజీల్లో భాగంగా రోజూ వీడియో కాల్​ ద్వారా డాక్టర్లు, నర్సులు, డైటీషియన్లు పేషెంట్లను మానిటర్​ చేస్తుంటారు. అపోలో హాస్పిటల్స్​.. ప్రాజెక్ట్​ కవచ్​ పేరుతో టెలీ కన్సల్టేషన్​ యాప్​ను లాంచ్​ చేసింది. దేశవ్యాప్తంగా 30 లక్షల మంది టెలీ కన్సల్టేషన్​ సేవలు వాడుకునే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది. తక్కువ లక్షణాలున్న వాళ్లనూ హోమ్​ఐసోలేషన్​ అవ్వాలని ఇటు డాక్టర్లూ చెబుతున్నారు. ఇటు జనాలు కరోనా సీరియస్​గా ఉన్న పేషెంట్లతో ఉంటే తమకూ అంటుకుంటున్న భయంతో హోమ్​ఐసోలేషన్​వైపే మొగ్గు చూపుతున్నారు.

హాస్పిటల్​                   రోజులు          బేసిక్​ ప్యాకేజీ      అడ్వాన్స్​డ్​ ప్యాకేజీ

కాంటినెంటల్​            7 రోజులు         రూ.3,499          రూ.3,999
15 రోజులు       రూ.6,499           రూ.7,999
యశోద                      15 రోజులు                                రూ.19,500
మెడికవర్                   5 రోజులు        రూ.5,000          రూ.6,500
సెంచరీ                    14 రోజులు                                 రూ.14,500
కిమ్స్​                        14 రోజులు                                 రూ.12,999
కేర్​                           17 రోజులు                                 రూ.7,999

డైట్​తోనే తొందరగా నయమైతది

మంచి ఫుడ్​తోనే కరోనా తొందరగా నయమైతది. హాస్పిటల్​లో అడ్మిట్​ అయిన కరోనా పేషెంట్లకు సరైన డైట్​ మెనూను ప్రత్యేకంగా ప్రిపేర్​ చేశాం. హోమ్​ ఐసోలేషన్​లో ఉన్న వారితో వీడియో కాల్స్​తో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నాం.ఎలాంటి ఫుడ్​ తీసుకోవాలో వాట్సాప్​, మెయిల్​, వీడియో కాల్​ ద్వారా పేషెంట్లకు తెలియజేస్తున్నాం. పాజిటివ్​ వచ్చిన వాళ్లు 17 రోజుల తర్వాత కూడా ఆ డైట్​నే రెండు, మూడు నెలల పాటు తీసుకుంటే చాలా వరకు మంచిది. ఇమ్యూనిటీ పెరిగేలా ఇమ్యునో న్యూట్రియంట్స్​ బాగా తీసుకోవాలి. విటమిన్​ సి, జింక్​ ఉండేలా చూసుకోవాలి.విటమిన్​ సీ ని రోజూ 500 ఎంజీ నుంచి 1,000 ఎంజీ వరకు తీసుకోవాలి. విటమిన్​ డీ కూడా ఎక్కువగా వాడాలి. ప్రోటీన్​ ఫుడ్​నూ తినాలి. పాలు, మాంసం, పుట్టగొడుగులు, గుడ్డులోని తెల్లసొన, పండ్లు, డ్రై ఫ్రూట్స్​ లాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి.
– డాక్టర్​ సుష్మ,
డైటీషియన్​, కేర్ హాస్పిటల్స్​

రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు