బెడ్లియ్యకుంటే.. ప్రైవేట్​ హాస్పిటళ్లు సీజ్​

బెడ్లియ్యకుంటే.. ప్రైవేట్​ హాస్పిటళ్లు సీజ్​
  • ఎక్సైజ్‌‌ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

మహబూబ్​ నగర్​, వెలుగు: ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా  పేషెంట్ల కోసం 20 శాతం బెడ్లు తప్పనిసరిగా  కేటాయించాలని, లేదంటే ఆ  ఆస్పత్రులను  ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హెచ్చరించారు.  సోమవారం ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డితో కలిసి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి  అందజేశారు. ప్రైవేట్ ఆస్పత్రులకు  450 రెమ్డిసివిర్‌‌‌‌  ఇంజక్షన్లు ఇవ్వాలని ప్రపోజల్స్​ పంపామని, ఎమ్మార్పీకే ఇంజక్షన్లను పేషెంట్లకు ఇవ్వాలని సూచించారు.  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో  250 ఆక్సీజన్​ బెడ్లు  ఉన్నాయని, మరో 250  బెడ్లు సిద్ధం చేయాల్సిఉందన్నారు.  కరోనా నేపథ్యంలో  అన్ని ప్రైవేట్‌‌ డయాగ్నోస్టిక్  సెంటర్లలో రూ. 1999కే సిటీ స్కాన్  చేసేందుకు అసోసియేషన్ అంగీకరించిందని మంత్రి తెలిపారు. డీఎంహెచ్​ఓ‌‌ ఆధ్వర్యంలో  ఆర్డీవో, డీఎస్పీ, డ్రగ్ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌తో ఒక టాస్క్​ఫోర్స్‌‌  ఏర్పాటు చేస్తున్నామని, ఈ టీమ్‌‌ ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్ల నుంచి వసూలు చేసే బిల్లులు , వారికి కల్పిస్తున్న సేవలపై నిఘా పెడుతుందని చెప్పారు.