హైదరాబాద్ నడిబొడ్డున 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమినే కబ్జా చేయాలని చూశారు !

హైదరాబాద్ నడిబొడ్డున 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమినే కబ్జా చేయాలని చూశారు !

హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున 400 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రైవేటు వ్యక్తుల యత్నించిన ఘటన సిటీలోని బంజారాహిల్స్లో జరిగింది. రాత్రికి రాత్రే ప్రభుత్వ బోర్డులు తుడిచేసి తిష్ట వేశారు. పెద్ద సంఖ్యలో రౌడీలను మోహరించారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని జలమండలి రిజర్వాయర్ పక్కన 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు పార్థసారథి, విజయ్ భార్గవ్ అనే వ్యక్తులు యత్నిస్తున్నారు. ఇప్పటికే వారిపై పోలీసులు మూడు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వి.ఆర్ ఇన్ఫ్రా (VR Infra) పేరుతో మరోసారి ఆక్రమణకు యత్నించారు. స్థలం విలువ సుమారు 400 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా.