ఆలిండియా సర్వీసుల్లోకి ప్రైవేట్ నిపుణులు

ఆలిండియా సర్వీసుల్లోకి ప్రైవేట్ నిపుణులు

కీలకమైన కేంద్ర ప్రభుత్వ శాఖల్లోప్రైవేట్ సెక్టార్ కు చెందిన తొమ్మిది మంది నిపుణులు జాయింట్ సెక్రెటరీలుగా నియమితులయ్యారు. ఈ మేరకు యూపీఎస్సీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కేవలం ఐఏఎస్, ఐపీఎస్ తదితర అఖిల భారత సర్వీసుల సీనియర్ అధికారులను మాత్రమే ఈపోస్టుల్లో నియమించేవారు. అయితే బ్యూరోక్రసీలో ఫ్రెష్ ట్యాలెంట్ కు అవకాశం ఇవ్వాలన్న ప్రధాని మోడీ కోరికతో పాటు నీతి ఆయోగ్ కూడా సిఫారసు చేయడంతో.. ప్రైవేటు రంగాల నిపుణులనూ నియమించాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం 6 వేల అప్లికేషన్లు రాగా అందులోంచి 9 మందిని యూపీఎస్సీ ఫైనల్ చేసింది. అంబర్ దూబే (సివిల్ ఏవియేషన్),అరుణ్ గోయల్ (కామర్స్), రాజీవ్ సక్సేనా(ఎకనామిక్ ఎఫైర్స్), సుజిత్ కుమార్ (ఎన్విరాన్ మెంట్), సౌరబ్ మిశ్రా (ఫైనాన్స్ సర్వీ స్),దినేష్ దయానంద్ (రెన్యూ వబుల్ ఎనర్జీ) సుమన్ ప్రసాద్ ( రోడ్ ట్రాన్స్ పోర్ట్), భూషన్కుమార్ ( షిప్పింగ్), కోక్లిగోష్ (అగ్రికల్చర్) శాఖలకు జాయింట్ సెక్రెటరీలుగా ఎంపికైనట్టు ప్రకటించింది. వీరంతా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేయనున్నారు. త్వరలో మరో89 జాయింట్ సెక్రెటరీ పోస్టులను కూడా ఈవిధంగా భర్తీ చేస్తామని యూపీఎస్సీ తెలిపింది.