ప్రైవేట్​ రీసెర్చ్​సెంటర్లను రద్దు చేయాలి

ప్రైవేట్​ రీసెర్చ్​సెంటర్లను రద్దు చేయాలి

ఓయూ, వెలుగు: ఓయూలో పీహెచ్​డీ అడ్మిషన్ పొందిన స్టూడెంట్లకు ప్రైవేట్​రీసెర్చ్ సెంటర్లలో గైడ్​లను అలాట్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. క్యాంపస్​లో అలాట్​మెంట్ కాపీలను తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు మాట్లాడుతూ.. రీసెర్చ్ సెంటర్లలో ఎటువంటి అనుభవం లేని డిగ్రీ లెక్చరర్లకు సూపర్ వైజర్ చాన్స్​ఇవ్వడం ద్వారా మా భవిష్యత్​అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే రూ.2 వేల నుంచి రూ.25 వేలకు పెంచిన పీహెచ్​డీ కోర్సు ఫీజును తగ్గించాలని, అడ్మిషన్​పొందిన ప్రతి స్టూడెంట్​కు హాస్టల్, మెస్​సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్టూడెంట్లు నెల్లి సత్య, ఆజాద్, అఖిల్, కిరణ్, మహేశ్, శ్రీవాత్సవ, గోవర్ధన్​తదితరులు  పాల్గొన్నారు.