
కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే.. షాపూర్ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలోని పార్కింగ్ ఏరియాలో ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో పాటు పొగలు భారీగా వ్యాపించాయి. బస్సులో ఎవరు లేకపోవడంతో పెను తప్పిన ప్రమాదం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సు పక్కన ఉన్న మరో రెండు బస్సులకు మంటలు వ్యాపించడంతో ఆ బస్సుల బయట భాగం కొంతవరకు కాలిపోయాయని తెలిపారు పోలీసులు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.