ఒకటి తర్వాత ఒకటి.. వరసగా ప్రమాదాలు కలవపెడుతున్నాయి. చేవెళ్ల దగ్గర ఆర్టీసీ బస్సున కంకర టిప్పర్ ఢీకొని 20 మంది చనిపోయిన సంచలనంగా మారింది. ఇదే సమయంలో మరో బస్సు యాక్సిడెంట్ కూడా జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ దగ్గర ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సును.. వెనక నుంచి వచ్చి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నది. ఈ యాక్సిడెంట్ లో ఎవరూ చనిపోలేదు.. రెండు బస్సుల్లోని ప్రయాణికులు చాలా చాలా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఏపీలోని పొదిలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వస్తుంది. శేరిగూడ దగ్గరకు రాగానే.. స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా స్పీడ్ తగ్గింది. ఇదే సమయంలో ఆర్టీసీ బస్సు వెనకనే వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్.. ఆర్టీసీ బస్సు వెనక ఢీకొట్టాడు. ఈ ఘటన ఆర్టీసీ వెనక భాగం.. ట్రావెల్స్ బస్సు ముందు భాగం బాగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే.. ఆయా బస్సుల్లోని ప్రయాణికులు బస్సులు దిగి మరో బస్సుల్లో వెళ్లిపోయారు.
కొత్తగా ఏర్పాటు చేసిన స్పీడర్ బ్రేకర్స్ :
శేరిగూడ దగ్గర ఈ స్పీడ్ బ్రేకర్లను కొత్తగా ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితమే ఈ స్పీడ్ బ్రేకర్స్ వల్ల.. వారం రోజుల్లోనే రెండు యాక్సిడెంట్స్ జరిగాయి ఈ ప్రాంతంలో. స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసిన అధికారులు.. అక్కడ తగిన సూచనలు, హెచ్చరికలు, బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ స్పీడ్ బ్రేకర్స్ ను హైవే అథారిటీ వాళ్లు ఏర్పాటు చేశారా లేక ప్రైవేట్ వ్యక్తులు వీటిని వేశారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. వారం క్రితమే స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయగా.. ఆ తర్వాత తొలగించారు.. ఇప్పుడు మళ్లీ వాటిని ఏర్పాటు చేయటం వివాదాస్పదం అవుతుంది.
