మహిళా ఉద్యోగికి రూ.16.73లక్షలు టోకరా

మహిళా ఉద్యోగికి రూ.16.73లక్షలు టోకరా
  • ఇన్వెస్ట్ పేరిట కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

బషీర్ బాగ్, వెలుగు :  స్టాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ ప్రైవేట్‌‌‌‌మహిళా ఉద్యోగిని సైబర్‌‌‌‌ క్రిమినల్స్ మోసగించారు.  హైదరాబాద్ సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఉద్యోగిని(46 )కి వీఐసీ 53 గ్రో క్యాపిటల్‌‌‌‌ సెక్యూరిటీస్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ నుంచి కొద్దిరోజుల కిందట వాట్సాప్‌‌‌‌ మెసేజ్‌‌‌‌ వచ్చింది. అప్పర్‌‌‌‌ సర్క్యూట్ స్టాక్‌‌‌‌లతో పాటు ఐపీవోల వివరాలు అందిస్తామని చెప్పారు. 

అనంతరం ఆమెను సైబర్‌‌‌‌ క్రిమినల్స్ సృష్టించిన గ్రూప్‌‌‌‌లో చేర్చారు. ప్రతిరోజూ ఉదయం 11:00 గంటల ప్రాంతంలో స్కామర్లు, అప్పర్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌ స్టాక్‌‌‌‌లను సూచించి వాటిలో పెట్టుబడి పెట్టమని చెప్పారు.వారి మాటలు నమ్మిన బాధితురాలు విడతల వారీగా బ్యాంక్‌‌‌‌ ఖాతాలకు మొత్తం రూ.16.73 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసింది. అనంతరం స్పందించకపోవడంతో మోసపోయానని సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు.