ప్రియదర్శి డార్లింగ్ మూవీ షూటింగ్ పూర్తి

ప్రియదర్శి డార్లింగ్ మూవీ షూటింగ్ పూర్తి

యాక్సిడెంట్ కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న నభా నటేష్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. వాటిలో ప్రియదర్శికి జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్’. వై దిస్ కొలవెరి అనేది ట్యాగ్‌‌లైన్. అశ్విన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ నిన్నటితో పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నభా షూటింగ్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను ఎంజాయ్ చేశానంది.

భార్యా భర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవల నేపథ్యంలో ఈ చిత్రాన్ని  రూపొందిస్తున్నారు. ఇందులో నభా నటేష్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, అందర్నీ ఆకట్టుకునే చిత్రమిది అని మేకర్స్ చెప్పారు.  ‘హనుమాన్’ ఫేమ్  కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.