నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది పారడైజ్’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ నుంచే సినిమాపై సోషల్ మీడియాలో మిక్సెడ్ టాక్ కనిపిస్తున్న వేళ.. ఓ క్యారెక్టర్ మాత్రం ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే హీరో ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్ర. సినిమాలో తెలంగాణ మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ క్యారెక్టర్‌ను పోలిన పాత్రలో ప్రియదర్శి కనిపించారు. ఈ పాత్రలో ప్రియదర్శి బాడీ లాంగ్వేజ్, తెలంగాణ యాస, డైలాగ్ డెలివరీ.. శంకరన్న పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
‘సావు నోట్లో తలకాయ పెట్టేసినారే.. మీకు గుర్తింపు తీసుకొస్తా!’
'ది ప్యారడైజ్' కథలో సవారీలు (నాని తెగ)కు ప్రభుత్వ పరంగా గుర్తింపు ఉండదు. వాళ్ళకు భారతదేశ పౌరసత్వం ఉండదు. అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న ఆ సవారీలకు అండగా నిలిచే ఎమ్మెల్యే శంకరన్న (కేసీఆర్) పాత్రలో ప్రియదర్శి నటించారు. అలా KCR పోలిఉన్న పాత్రకు సంబంధించిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా “సావు నోట్లో తలకాయ పెట్టేసినారే.. మీకు గుర్తింపు తీసుకొస్తా” అంటూ ప్రియదర్శి చెప్పే డైలాగ్‌పై నెటిజన్లు, ఆడియన్స్ ప్రత్యేకంగా కామెంట్స్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఒకవైపు తెలంగాణ యాస.. మరోవైపు రాజకీయ నాయకుడి తరహా బాడీ లాంగ్వేజ్.. ఇంకోవైపు పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ప్రియదర్శి ఈ పాత్రను క్యారీ చేసిన విధానం ఆసక్తిని పెంచింది.
KCR పోలికలు ఎందుకు?
‘ది పారడైజ్’ కథ 1980ల కాలం నాటి హైదరాబాద్/సికింద్రాబాద్ నేపథ్యంలో తెరకెక్కింది. ఆ ‘ది పారడైజ్’ ప్రపంచంలో ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్ర MLAగా కనిపిస్తుంది. పాత్రను చూసిన ప్రేక్షకుల్లో కొందరికి KCRను గుర్తు చేసిందనే చర్చ మొదలైంది. అందుకే సినిమా విడుదలైన తర్వాత ఈ క్యారెక్టర్ సోషల్ మీడియా డిస్కషన్‌లోకి వచ్చింది. సినిమా చూసిన తర్వాత ఈ పాత్రపై సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్స్‌లో ప్రధానంగా కనిపిస్తున్న అంశం ప్రియదర్శి క్యాస్టింగ్. “ఈ పాత్రకు ప్రియదర్శి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు”, “తెలంగాణ యాస, మేనరిజమ్స్ బాగా క్యారీ చేశాడు” అంటూ ప్రేక్షకులు స్పందిస్తున్నట్లు పోస్టులు కనిపిస్తున్నాయి.
అయితే సినిమా మొత్తంపై సోషల్ మీడియా టాక్ మాత్రం మిక్స్‌డ్‌గా ఉంది. కొందరు ఫస్ట్ హాఫ్, నాని మాస్ ప్రెజెన్స్, ఇంటర్వెల్ బ్లాక్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను మెచ్చుకోగా.. మరికొందరు సెకండ్ హాఫ్ నెమ్మదించడం, ఎడిటింగ్, కథనంపై విమర్శలు చేస్తున్నారు.
ALSO READ నాని ‘ది ప్యారడైజ్’ రివ్యూ..
మొత్తానికి ‘ది పారడైజ్’లో నాని మాస్ అవతార్, అనిరుధ్ బీజీఎం, శ్రీకాంత్ ఓదెల టేకింగ్‌తో పాటు ప్రియదర్శి పోషించిన శంకరన్న క్యారెక్టర్ కూడా సోషల్ మీడియా చర్చలోకి వచ్చింది. ఇప్పుడు ఈ శంకరన్న పాత్రకు సంబంధించిన వీడియోలు, డైలాగ్స్ ఎంతవరకు వైరల్ అవుతాయో చూడాలి.
