గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు బుధవారం1023 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కు 985 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 316. 620 మీటర్ల నీరు నిల్వ ఉంది. 38 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోందని ఆఫీసర్లు తెలిపారు.
