
నానితో గ్యాంగ్ లీడర్, శర్వానంద్‌కి జంటగా శ్రీకారం చిత్రాల్లో నటించిన ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan).. కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ కెప్టెన్ మిల్లర్ లో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్‌లో ఎక్కువ కనిపించిన ఆమె, ఈసారి అందుకు పూర్తి భిన్నంగా యాక్షన్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో చేతిలో గన్‌తో కనిపించింది. తాజాగా ప్రియాంక క్యారెక్టర్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ పోస్టర్‌లో డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్‌కు పాయింట్ బ్లాంక్‌లో గన్ గురి పెడుతూ కనిపించిందామె. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. డిసెంబర్ 15న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది.
It's a wrap for our Heroine @priyankaamohan in #CaptainMiller ??
— Sathya Jyothi Films (@SathyaJyothi) August 30, 2023
DECEMBER 15 ,2023 Worldwide Release@dhanushkraja @ArunMatheswaran @gvprakash @saregamasouth pic.twitter.com/kPq4Jtfy1G