
మొదటి డేట్ లో శృంగారంపై షాకింగ్ కామెట్స్ చేసింది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. అలా చేయడం వల్ల బంధాలు బలపడతాయని ఆమె తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన లైఫ్ గురించి చాలా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగా యాంకర్.. మీరు ఫస్ట్ డేట్ శృంగారాన్ని ఒప్పుకుంటారా అని అడిగింది. దానికి ప్రియాంక.. ఒప్పుకుంటానని తెలిపింది.
దీనివల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుందని, భవిష్యత్‌లో మనతో ఎలా ఉంటాడో అనే విషయాలు తెలుస్తాయని చెప్పుకొచ్చింది. ఇంకా తాను చాలా మంది ప్రముఖ వ్యక్తులతో డేటింగ్ చేశానని కానీ ఆ బందాలేవీ ఎక్కువ కాలం నిలవలేదని తెలిపింది. ఆ తరువాత కొంతకాలానికి నిక్ పరిచయం అయ్యాడని, అతనితో కొంతకాలం డేటింగ్ చేసాక..పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకొచ్చింది ప్రియాంక. 2018లో నిక్,ప్రియాంక పెళ్లి జరగగా.. సరోగసి పద్ధతిలో ఒక పాపను కూడా కన్నారు ఈ జంట.
ఇక ప్రియాంక సినీ జీవితానికి వస్తే.. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.