మతం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నరు

మతం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నరు
  • బీజేపీపై ప్రియాంక గాంధీ ఫైర్‌‌‌‌‌‌‌‌

ఉనా(హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌): అధికారం కోసం మతం పేరుతో ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ మభ్యపెడుతున్నారని కాంగ్రెస్‌‌‌‌ నేత ప్రియాంక గాంధీ అన్నారు. దేశం కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తన బంగారాన్ని ఒలిచి ఇచ్చారని, అయితే.. కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వస్తే మహిళల మంగళసూత్రాలను దొంగలిస్తుందని అనడం కరెక్ట్‌‌‌‌ కాదన్నారు. ఇలాంటి భాష ఉపయోగించడం దేశ ప్రధాని స్థాయికి తగదన్నారు.

మంగళవారం హిమాచల్‌‌‌‌లోని ఉనా జిల్లాలో గాగ్రీట్‌‌‌‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక మాట్లాడారు. మోదీ తనను తాను దేవుడిగా భావించుకుంటూ మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని, కానీ, ప్రజలు మీ మాటలు నమ్మరని పేర్కొన్నారు. గతేడాది హిమాచల్‌‌‌‌లో వరదలు వచ్చినప్పుడు రాష్ట్రాన్ని ఆదుకోని కేంద్ర ప్రభుత్వం.. ధనిక పారిశ్రామిక వేత్తలకు మాత్రం రూ.16 లక్షల కోట్లను మాఫీ చేసిందని మండిపడ్డారు. వరదల సమయంలో తమ పార్టీ లీడర్లు, కార్యకర్తలు గ్రౌండ్‌‌‌‌లో లెవల్‌‌‌‌లో రాష్ట్రం కోసం పనిచేశారని చెప్పారు. తాము ప్రజల కోసం పనిచేస్తున్నామని, డబ్బు కోసం కాదని.. అది తమ బాధ్యత అని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.