రాజ్యాంగం మారిస్తే హక్కులు పోతయ్ : ప్రియాంక గాంధీ వాద్రా

రాజ్యాంగం మారిస్తే హక్కులు పోతయ్ : ప్రియాంక గాంధీ వాద్రా

రాయ్ పూర్ :  బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రజల హక్కులను కాలరాయడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. ఆదివారం చత్తీస్ గఢ్ బలోద్ లో ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. “రాజ్యాంగం మీకు ఓటు హక్కు ఇవ్వడంతో పాటు రిజర్వేషన్లు కల్పించింది.  

గిరిజన సంస్కృతికి రక్షణ కల్పించింది. దళితుల అభివృద్ధిని సులభతరం చేసింది. కానీ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని, ప్రజల హక్కులను కాలరాయాలని చూస్తోంది. రాజ్యాంగంలో ఏదైనా మార్పు చేస్తే ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపలేరు. ప్రశ్నించే హక్కుతో పాటు అనేక హక్కులను ప్రజలు కోల్పోతారు. బీజేపీ ఉద్దేశం సరైనది కాదు” అని చెప్పారు.