ఉద్యోగాలకోసం మనం కష్టపడుతుంటే..ప్రభుత్వం లీకులు చేస్తోంది: ప్రియాంక గాంధీ

ఉద్యోగాలకోసం మనం కష్టపడుతుంటే..ప్రభుత్వం లీకులు చేస్తోంది: ప్రియాంక గాంధీ

ఎన్నికల టైంలో బీఆర్ఎస్ చెప్పే బూటకపు మాటలు నమ్మొద్దని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ  అన్నారు. తొర్రూరులో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరయ్యారు ప్రియాంక గాంధీం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదేండ్లుగా తెలంగాణలో బీఆర్ ఎస్ అధికారంలో ఉంది.. ఏ లక్ష్యం కోసమైతే  రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అవి ఒక్కటైనా నెరవేరాయా   అని ప్రశ్నించారు. ఈ పదేళ్లలో ఎంత మంది యువకులు ఉపాధి, ఉద్యోగాలు కల్పించారో  బీఆర్ ఎస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. 

ఉద్యోగాలకోసం యువత కష్టపడుతుంటే.. బీఆర్ ఎస్ ప్రభుత్వం మాత్రం లీకులు చేస్తోందని ఆరోపించారు ప్రియాంక గాంధీ.  పేపర్ లీకులతో యువతి ఆత్మహత్య చేసుకుంటే తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. యువకులే దేశ నిర్మాతలు.. అలాంటి యువత అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని.. అధికారంలోకి రాగనే యువత, నిరుద్యోగులకోసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. 
అంతేకాదు... పదేళ్లో రైతుల నుంచి బీఆర్ ఎస్ ప్రభుత్వం భూములను లాక్కొందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. త్యాగాలతో ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీని గెలించుకుంటే ఏ లక్ష్యంతో అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో.. అవి నేరవేరుతాయని ప్రియాంక గాంధీ చెప్పారు.