ప్రియాంకా గాంధీ ఫ్యామిలీలో ఒకరికి కరోనా

V6 Velugu Posted on Jan 03, 2022

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కుటుంబంలో ఒకరికి కరోనా సోకింది. అలాగే ఆమె ఆఫీసు స్టాఫ్‌లోనూ ఒకరికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ప్రియాంకా గాంధీ స్వయంగా తన ట్విట్టర్‌‌ అకౌంట్‌లో సోమవారం రాత్రి పోస్ట్‌ చేశారు. తన కుటుంబంలో ఒకరికి కరోనా వచ్చిందని తెలిపిన ప్రియాంక.. ఎవరికి పాజిటివ్ వచ్చిందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే తాను కూడా కరోనా టెస్టు చేయించుకోగా.. నెగెటివ్ వచ్చిందని తెలిపారు ప్రియాంక. అయితే తనను కొద్ది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని ఆమె తెలిపారు.

 

Tagged Covid vaccine, Priyanka Gandhi, home isolation, Corona test, COVID positive

Latest Videos

Subscribe Now

More News