ఇండియా తీరుతో సిగ్గుపడ్డా: ప్రియాంక

ఇండియా తీరుతో సిగ్గుపడ్డా: ప్రియాంక

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ కు ఇండియా గైర్హాజరు కావడం పట్ల షాక్ అయ్యానని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. మన దేశం తీరుతో తాను సిగ్గుపడ్డానని ఆమె ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనా అంశంలో ఇండియా తీరు గందరగోళంగా ఉందని ఎన్ సీపీ నేత శరద్ పవార్ విమర్శించారు. 

మరోవైపు వీరిద్దరి కామెంట్లపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇండియా ఎప్పుడూ టెర్రరిజం వైపు నిలబడలేదన్న సత్యాన్ని ‘‘షాక్ అయి, సిగ్గుపడినవారు” తెలుసుకోవాలంటూ బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కామెంట్ చేశారు.