ప్రియాంక పిల్లల ఇన్‌స్టా అకౌంట్స్ హ్యాక్ కాలేదు

V6 Velugu Posted on Dec 23, 2021

కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఇద్దరు పిల్లల ఇన్‌స్టాగ్రాం ఖాతాలు హ్యాక్ కాలేదని అధికారిక వర్గాలు  తెలిపాయి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్ CERT-In నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం బయటపడినట్లు తెలిపాయి. తన పిల్లల ఇన్‌స్టాగ్రాం అకౌంట్స్ ను  ప్రభుత్వం హ్యాక్ చేసిందని రెండు రోజుల క్రితం ప్రియాంక ఆరోపించారు. ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్‌ చేస్తోందంటూ ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలపై స్పందించమనగా.. ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫోన్ ట్యాపింగే కాదు.. వాళ్లు నా పిల్లల ఇన్‌స్టాగ్రాం ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారన్న ప్రియాంకా గాంధీ.. వాళ్లకు వేరే పనిలేదా  అని అన్నారు.  అయితే  దానిపై అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఈ ఆరోపణల్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం సైబర్ సెక్యూరిటీ టీమ్‌తో దర్యాప్తు చేయించనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది వెలుగులోకి వచ్చిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారంతో ఇటీవల పలువురు నేతలు నుంచి ఫోన్‌ ట్యాపింగ్ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

మరిన్ని వార్తల కోసం..

పాజిటివ్ వచ్చిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఒమిక్రాన్

 

 

Tagged children, instagram, Priyanka Gandhi, Not Hacked

Latest Videos

Subscribe Now

More News