కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరపాలి : పటేల్ రమేశ్ రెడ్డి

కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరపాలి : పటేల్ రమేశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు: గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం, వారి బినామీలు వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారని టూరిజం డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేశ్​రెడ్డి ఆరోపించారు. ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేరిట ఉన్న ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులకు, ఆ తర్వాత పోగైన వేల కోట్ల ఆస్తులకు పొంతన లేదని, వివిధ జిల్లాల్లో ఉన్న భూములు, మై హోమ్ సంస్థకు కేటాయించిన భూముల వివరాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఇది రాజకీయ కక్షసాధింపు కాదని, రెవెన్యూ, ఆదాయపన్ను రికార్డుల ఆధారంగా పక్కాగా దర్యాప్తు జరిపి ప్రజాధనాన్ని దోచుకున్న వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని ఆయన స్పష్టం చేశారు.