క్లినికల్ ట్రయల్స్ లో సమస్యలు రావడం మామూలే

క్లినికల్ ట్రయల్స్ లో సమస్యలు రావడం మామూలే

వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆక్స్ ఫర్డ్ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోయింది. ట్రయల్స్ నిలిపివేడయం దురదృష్టకరమైన పరిణామమే అయినా, అసాధారణ విషయమేమీ కాదన్నారు యూఎస్ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ. పని దగ్గర ఇదొక సేఫ్టీ వాల్వ్ లాంటిదని చెప్పారు. తిరిగి వాళ్ల ట్రయల్స్ కొనసాగిస్తారని ఆశిస్తున్నానన్నారు. అయితే దీనిపై మరింత దర్యాప్తు జరగాల్సిన అసవరం ఉందన్నారు.

మరోవైపు వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇలాంటి సమస్యలు తలెత్తడం సాధారణ విషయమేనని ఆస్ట్రాజెనికా సీఈఓ పాస్కల్ సోరియట్ తెలిపారు. ఈ విధంగా జరిగినప్పుడు మరోసారి లోతైన సమీక్ష నిర్వహించి.. తిరిగి ప్రయోగాల్ని కొనసాగిస్తుంటామన్నారు. ఇంత భారీ స్థాయిలో ట్రయల్స్ నిర్వహించినప్పుడు ఒకరిద్దరిలో అనారోగ్య సమస్యలు రావడం సాధారణంగా జరుగుతుందన్నారు. అయితే ఆ వాలంటీరుకు తలెత్తిన ఆరోగ్య సమస్య వ్యాక్సిన్ తో  వచ్చిందా లేక  మామూలుగానే వచ్చిందా అనే విషయం తెలియాల్సి ఉందన్నారు.