పర్వతగిరి, వెలుగు: బీటెక్ అగ్రికల్చర్లో ప్రతిభ చూపిన పర్వతగిరి మండలం గోపనపల్లికి చెందిన ప్రవళిక రాష్ర్ట ప్రభుత్వ సహకారంతో అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు ఎంపికయ్యింది. తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రతిభావంతులైన నలుగురు విద్యార్థులను ఫెలోషిప్ కు ఎంపిక చేశారు. ఇందులో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపెల్లికి చెందిన బోయిని అయిలయ్య, రేణుకల కూతురు ప్రవళిక కూడా ఉంది. ప్రవళిక 2 సంవత్సరాల మాస్టర్స్ కోసం రూ.55.50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా, అమెరికాలో చదువుకుంటానని అనుకోలేదని, నాన్న ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైందని ప్రవళిక సంతోషం వ్యక్తం చేసింది.