తెలంగాణలో మొదలైన టీచర్ల బదిలీలు

  తెలంగాణలో మొదలైన టీచర్ల బదిలీలు
  • తొలిరోజు 1,578 ఫ్రెష్ అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మొదలైంది. మూడు రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వగా.. తొలిరోజైన ఆదివారం కొత్తగా 1,578 మంది అప్లై చేశారు. ఫిబ్రవరిలో అప్లై చేసిన వారికీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వగా, ఆదివారం ఒక్కరోజే 31,284 మంది తమ దరఖాస్తులను సవరించుకున్నారు. కొత్తగా దరఖాస్తు చేసేందుకు, సవరణలకు సోమ, మంగళవారాల దాకా అవకాశముంది. మెడికల్ ప్రిఫరెన్షల్ కేటగిరీలో అప్లై చేసే వారు తప్పకుండా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఆన్​లైన్​లో అప్‌‌‌‌లోడ్ చేయాల్సి ఉంది.

 అయితే ఫిబ్రవరిలో అప్లై చేసుకున్న వారు ఆన్ లైన్​లో ప్రత్యేకంగా ఎడిట్ చేయాల్సిన అవసరం లేదని, గతంలో చేసిన అప్లికేషన్​లో ఏమైనా మార్చాలనుకుంటే సవరించి, ఆ హార్డ్ కాపీలను డీఈఓలకు ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. 8 ఏండ్ల సర్వీస్ నిండిన టీచర్లు, 5 ఏండ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న హెడ్మాస్టర్లు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు.