
- లాటరీ ద్వారా 401 మందికి ఇండ్లు
- రేపటి నుంచి ఓపెన్ ప్లాట్ల వేలం
హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారం ప్రాంతా ల్లో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. లాటరీ ద్వారా 401 మందికి ఫ్లాట్లు కేటాయించగా, ఈ అమ్మకాల ద్వారా రూ.78 కోట్ల ఆదాయం సమకూరిందని రాజీవ్ స్వగృహ కార్పొరే షన్ ఎండీ వీపీ గౌతమ్ శనివారం ఓ ప్రకటనలో తెలి పారు. పోచారంలో ఎక్కువ శాతం ఒక్కో ఫ్లాట్లకు ఒక్కొక్క అప్లికేషన్ రాగా.. ఒక త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌కు 69 అప్లికేషన్లు వచ్చినట్లు వెల్లడించారు. బండ్లగూడ, పోచారంలో మిగిలిన 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే ఫ్లాట్లకు దరఖాస్తు చేసుకునేందుకు అదనపు సమయం ఇవ్వాలన్న ప్రజల విజ్ఞప్తి మేరకు..
ఈ నెల 8వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎండీ గౌత మ్ తెలిపారు. ఈ ఫ్లాట్లను ‘ముందు వచ్చిన వారికి ముందు’ (ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్) ప్రాతిపదికన కేటాయిస్తామన్నారు. కేవలం సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, నగర శివార్లలోని పలు ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన ఓపెన్ ప్లాట్ల ను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. 200 చ.గ. కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఈ ప్లాట్ల వేలం ఈ నెల 4వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరుగుతుందని ఎండీ గౌతమ్ ప్రకటించారు.