
రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య లీడ్ రోల్స్‌లో కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన చిత్రం ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మించిన సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా లారెన్స్, ఎస్ జె సూర్య చెప్పిన విశేషాలు. లారెన్స్ మాట్లాడుతూ ‘ఈ మూవీ ఫస్ట్ పార్ట్ నేనే చేయాల్సింది. కానీ అప్పుడు డైరెక్షన్‌లో బిజీగా ఉండటంతో కుదరలేదు. దీంతో కార్తీక్ సుబ్బరాజ్‌ని అడిగి మరీ రెండో పార్ట్‌లో నటించాను. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్, సెకెండ్ హాఫ్‌లో ఎమోషన్ ఉంటుంది. ఇందులో కొత్త లారెన్స్‌ను చూస్తారు. త్వరలోనే ఇక్కడ కూడా రాఘవేంద్రస్వామి గుడి కట్టి.. తెలుగు రాష్ట్రాల్లోనూ చారిటీ మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నా’ అని చెప్పాడు. ఎస్ జె సూర్య మాట్లాడుతూ ‘ ఇందులో లారెన్స్ గారు గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తే.. నేనేమో ఆయన్ను డైరెక్ట్ చేసే దర్శకుడి పాత్రలో నటించా. కార్తీక్ మమ్మల్ని చాలా కొత్తగా చూపించారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంది. ఈ మూవీ షూటింగ్ కోసం ట్రైబల్ విలేజ్‌కి రోడ్డు కూడా వేశారు నిర్మాతలు. దీంతో అక్కడి ప్రజలు హ్యాపీ ఫీలయ్యారు’ అని చెప్పాడు.