యూనివర్సల్ ఎమోషన్‌‌‌‌తో భోళాశంకర్

యూనివర్సల్ ఎమోషన్‌‌‌‌తో భోళాశంకర్

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘భోళా శంకర్’. తమన్నా హీరోయిన్. కీర్తి సురేష్, సుశాంత్ కీలకపాత్రలు పోషించారు. ఈనెల 11న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర ఇలా ముచ్చటించారు. 

‘‘‘సరిలేరు నీకెవ్వరు’ ఈవెంట్‌‌‌‌ కోసం చిరంజీవి గారిని కలిసినప్పుడు ‘మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నానండీ ఫైనల్ గా కలిశాను’ అన్నాను. ‘కలవడం ఏంటండీ? సినిమా చేస్తున్నాం’ అన్నారు మెగాస్టార్. అప్పటికే నా దగ్గర ‘వేదాళం’ కన్నడ రైట్స్ వున్నాయి. చిరంజీవి గారితో ఈ రీమేక్ ఎలా ఉంటుందా అని మెహర్ రమేష్, నేను మాట్లాడుకునేవాళ్లం. అప్పటికే ఈ సబ్జెక్ట్ చిరంజీవి గారితో చెప్పారట రమేష్. ఆయనకూ చాలా నచ్చడంతో సినిమా మొదలైంది. తెలుగు రైట్స్‌‌‌‌ ఎఎం రత్నం గారిని అడిగితే వెంటనే ఇచ్చారు. చెన్నైలో కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి చెల్లెలి పాత్రకు ఆమెను ఫైనలైజ్ చేశాం. ఆమెను తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించలేదు. 

‘నిర్మాత సెట్‌‌‌‌లో ఉంటే చిరంజీవి గారు చాలా హ్యాపీ ఫీలవుతారు’ అని మహేష్ బాబు నాకు సలహా ఇచ్చారు.  అందుకే 40 రోజుల పాటు సెట్‌‌‌‌లో ఉన్నా. ఇది చాలా మెమరబుల్ జర్నీ. ఒక్క రోజు కూడా వృధా కాకుండా ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకున్నా. చాలా ఎంజాయ్ చేశాను. బడ్జెట్ కంట్రోల్ విషయంలో చిరంజీవి గారికి వున్న క్లారిటీ ఎవరికీ లేదు. ఎక్కువ అవుతుందని ఒక్క మాట చెబితే.. బాగా ఇన్వాల్వ్ అయి ఎలా తగ్గించాలనేది చూస్తారు. అవుట్​పుట్ విషయంలో చిరంజీవి గారు, మేము చాలా హ్యాపీగా వున్నాం. ఇదొక మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఖచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది. బ్రదర్ సిస్టర్ ఎమోషన్ యూనివర్సల్. అందరికీ కనెక్ట్ అవుతుంది’’.