దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డిపై ప్రశంసల వర్షం.. నిర్మాత బండ్ల గణేశ్ ఎమోషనల్ స్పీచ్

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డిపై ప్రశంసల వర్షం.. నిర్మాత బండ్ల గణేశ్ ఎమోషనల్ స్పీచ్

కుటుంబ కథా చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి.  32 ఏళ్ల కెరీర్‌‌‌‌లో 42 ఎవర్ గ్రీన్ మూవీస్ రూపొందించారు. ఆదివారం ఆయన బర్త్‌‌డే సందర్భంగా తనతో వర్క్ చేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరితో కలిసి పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఎస్వీ కృష్ణారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.  "నా జీవితంలో ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా గురువుగారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన నా తండ్రి లాంటి వారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న టైంలో ఎస్వీ కృష్ణారెడ్డి పరిచయమయ్యారని బండ్ల గణేశ్ తెలిపారు.

"నేను షాద్‌నగర్ వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్న సమయంలో, నా మిత్రుడు శ్రీకాంత్ నన్ను షిరిడీ తీసుకెళ్ళాడు. అక్కడ దర్శనం చేసుకుని వస్తుండగా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు కలిసి 'గణేశ్ నీకు వేషం ఇస్తాం అని 'వినోదం' సినిమా ద్వారా నన్ను నటుడిగా పరిచయం చేశారు. అని ఆనాటి సంఘటనను బండ్ల గణేశ్ గుర్తుచేసుకున్నారు.

'వినోదం' సినిమాకు గానూ అచ్చిరెడ్డి గారు తనకు పదివేల రూపాయల నగదు, ఒక నవరత్నాల ఉంగరం ఇచ్చారని, ఆ డబ్బు, ఉంగరం ఇప్పటికీ బీరువాలో భద్రంగా దాచుకున్నానని బండ్ల గణేశ్ తన జ్ఞాపకాలు పంచుకున్నారు. 

ఈ కార్యక్రమంలో నటులు  శ్రీకాంత్, ఆమని, ఇంద్రజ, లయ, అలీ, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, చంద్రబోస్, రవళి, రాజేంద్రప్రసాద్, రోజా, మురళీమోహన్, తదితరులు పాల్గొని ఎస్వీ కృష్ణారెడ్డితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.