హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న బెల్లంకొండ సురేష్ మరో తనయుడు

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న బెల్లంకొండ సురేష్ మరో తనయుడు

నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వంలో  సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రావు రమేష్, ప్రగతి, నరేష్, సురేఖా వాణి, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, హర్షవర్థన్‌‌‌‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాని జులైలో విడుదల చేయబోతున్నట్లు నిన్న ప్రకటించారు. ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌ను కూడా వదిలారు. ఇందులో గణేష్, వర్ష చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఆఫీసుకు వెళ్తున్నారు. ఇది ‘స్వాతిముత్యం’ లాంటి అమాయకుడి కథ అంటున్నారు మేకర్స్. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను అలరిస్తాయని చెబుతున్నారు.