ప్రొడ్యూసర్ బన్నీ వాస్ చేతుల మీదుగా కడలే కదిలే సాంగ్ రిలీజ్

ప్రొడ్యూసర్ బన్నీ వాస్ చేతుల మీదుగా కడలే కదిలే సాంగ్ రిలీజ్

RJ సూర్య మరియు తేజస్వి రావు నటించిన తాజా తెలుగు పాట 'కడలే కదిలే' ని గీత ఆర్ట్స్ 2 ప్రొడ్యూసర్ బన్నీ వాస్ రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా సమాజంలోని లోతుగా పాతుకుపోయిన అన్యాయాలను వెలుగులోకి తెచ్చేలా, ముఖ్యంగా కులం మరియు రిజర్వేషన్లకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించేలా ఈ పాట వుంటుందని  బన్నీ వాస్ తెలిపారు. 

హృదయాన్ని హత్తుకునేలా మెలోడీ ట్యూన్ తో మ్యూజిక్ డైరెక్టర్ పవన్ స్వరపరిచిన ఈ గీతానికి అరుణ్ కౌండిన్య ఆలపించారు. ఈ పాటకు డైరెక్టర్ వేద తనదైన శైలిలో లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. 

ప్రస్తుతం బన్నీ వాస్ నిర్మించిన ‘ఆయ్‌‌’ మూవీ ఆగస్టు 15న రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీలో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించగా అంజి కె మ‌‌ణిపుత్ర దర్శకత్వం వహించారు. ‘ఇదొక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్..గోదావరి బ్యాక్‌‌డ్రాప్‌‌లో స్నేహం గొప్పదనం చెప్పేలా కథ సాగుతుంది.