ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. ఎందుకో తెలుసా?

ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. ఎందుకో తెలుసా?

ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్(C Kalyan) ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై తన గళాన్ని విప్పడానికి ముందుకు వచ్చారు. ఎన్నో ఏళ్ళ నుంచి మూవీ ఆర్టిస్టుల   సమస్యలను.. ప్రతి ఒక్క విభాగం పనితీరును దగ్గర ఉండి  గమనిస్తున్నాని కళ్యాణ్ తెలిపారు. ఇలా తనలోని భాధ్యతలను అమలు పరచడానికి అధ్యక్షుడిగా మారే అవసరం వచ్చిందని తెలుపుతూ.. పలు డిమాండ్స్ ను వ్యక్త పరిచారు నిర్మాత సి. కళ్యాణ్. 

నా జర్నీ మొదలు.. దాసరి బాటలో నిర్మాతగా,నిర్మాతల మండలిలో చిన్న సభ్యుడిగా ఎదగడం నుంచి.. నిర్మాతల సంక్షేమం కోసం రకరకాలుగా ఆదాయాన్ని సమకూర్చడం వరకు కష్టపడ్డానని తెలిపారు. అలాగే మొదట నిర్మాతలకు మెడిక్లైమ్ తీసుకరావడంలో కృషి చేశానని వెల్లడించారు. ఫైవ్ స్టార్ లెవెల్లో ఓల్డేజ్ హోమ్ ని నిర్మించాలనేది నా డ్రీమ్ అంటూ పేర్కొన్నారు.  దర్శకరత్న దాసరి నారాయణరావు సినిమా పరిశ్రమ కొరకు స్వార్ధం లేకుండా పని చేశారని గుర్తు చేసుకున్నారు.

గత కొన్ని ఏళ్ళ నుంచి ఫిల్మ్ ఛాంబర్ పరిస్థితులు సర్వనాశనం అయ్యాయని.. నిర్మాతల మండలి ఆదాయానికి గిల్డ్ అనే గ్రూపు గండి కొట్టింది అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు చిత్రం పరిశ్రమ అంటే కేవలం తెలుగు సినిమా వాళ్లనే కాకుండా.. మన పక్కన ఉన్న నాలుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమలను కలిపి లీడ్ చేయడానికి అందరం ఆలోచిస్తున్నాం. అందుకు మన ప్రభుత్వ సహకారం తీసుకుని.. అక్కడ ఉన్న ఆయా ప్రభుత్వాల సహకారంతో నాలుగు రాష్ట్రాల పరిశ్రమలకు మంచి చేయటానికి ఆలోచన మొదలైందని మనసులో మాట వెల్లడించారు సి.కళ్యాణ్. 

అందుకే  నేను ఈ దఫా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి బలమైన కారణం అని పేర్కొన్నారు. గతంలో దిల్ రాజు, దామోదరప్రసాద్ వచ్చి డిజిటల్ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విరమించుకున్నాను. కానీ మిగతా సమస్యలను పరిష్కరించడానికి తగు కార్యచరణతో ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. ఎన్నికల్లో పోటిపై దిల్ రాజును కలిసి చర్చించాను. 

ముఖ్యంగా గిల్డ్ లోని 27 మంది సభ్యులు 1600 మంది నిర్మాతల రక్తం తాగుతున్నారు. వారిలో మార్పు రావాలి. ఆస్కార్  నిర్మాత దానయ్య,  బాహుబలి నిర్మాత శోభుయార్లగడ్డను ఇంత వరకు ఎందుకు నిలబెట్టడం లేదని ప్రశ్నించారు సి కళ్యాణ్. 

అలాగే చిన్న సినిమాలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని.. చిన్న సినిమాలు ఆపితే కృష్టానగర్ అకలితో అలమటిస్తుంది. ఎందుకంటే రెండు లక్షల రూపాయలు లేకుండా సినిమా విడుదల ఆగిపోయిన సందర్భాలు నేను ఎదుర్కొన్నాను. చిన్న బడ్జెట్ సినిమాలకు థియేటర్లను కేటాయించాలి. ఓటు హక్కు ఉన్నవాళ్లలో 1600 మంది నిర్మాతలున్నారు. ఆ మధ్యలో ఐదుగురు నిర్మాతలు మాత్రమే  చిన్న సినిమాలకు మేం ఉన్నామని చెబితే సంతోషించాం. కానీ అందరు ముందుకు రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు కళ్యాణ్. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో  ఫిల్మ్ ఛాంబర్ కు సేవ చేసేవాళ్లు కావాలి. సంపాదించుకోటానికి ముందుకు వచ్చేవారు కాదని.. బెదిరించడానికో.. ఊరికే డైలాగ్స్ కొట్టడానికో కాదని తెలియజేఏశారు. ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాణ సంస్థలకు ఓటు హక్కు ఉందే కానీ వ్యక్తులకు కాదు. వారికే ఉండే నిర్మాణ సంస్థ తరపున.. ప్రతినిధి తన ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు.

 మరి ముఖ్యంగా దిల్ రాజు పక్కనున్న వాళ్లకు పోస్టులు కావాలి కానీ ఆచరణ లో భాగం కావడానికి ప్రయత్నం లేదని సి కళ్యాణ్ పేర్కొన్నారు. 
చిన్న సినిమాలతో పాటు.. డిస్ట్రిబ్యూటర్లు అందరు బాగుండాలనేది నా ఉద్దేశ్యం అంటూ మీడియా ముఖంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడారు. ఈ కార్యక్రంలో నిర్మాత నట్టీ కుమార్ తో పాటు పలువురు నటులు పాల్గోన్నారు.